ప్రపంచమంతా
మరి మోగిందా
ప్రధానమైన ఆకర్షణంతా!
హిగ్గ్స్ బోసనూ
ఐనుస్టీనూ
ఒక్కొక్కటిగా విడుతూ పోతే
విశ్వమంతా ఒకటే అనిందా!
వేదాలంతా చెప్పినదంతా
ఒకటే శబ్దపుసడి మొదలంతా!
శబ్దపు అలలలో సమస్తమంతా
సున్నాల బరువుల సమస్యలంత
కాంతివేగాన మన ఆయుష్షెంత?
మరిమరి తెలిసి
మనసొదిగుండనిదే వింత!
ఎంతోవుంటే చుట్టూరంతా
మనమీచోట ఉండేదెంత!
ఉన్నవి కొన్నీ
విలువలనిన్నీ
చిలువలు పలువలు
చేయకు అవిన్నీ!
ఆనందంగానైనా కొన్ని
మధురంగా మార్చి మరిన్నీ
పంచెయ్ తరాలకు, నువు మరి ఎన్ని!
No comments:
Post a Comment