Saturday, August 13, 2016

జానపదం 2

సన్నాని నడుము నీదందే! ఓ సిరిమల్లెమొగ్గా!
తీగల్లే అల్లుకు పోయేనా!

సొట్టాల బుగ్గలు నీవందే! ఓ ముత్యపు చిప్పా!
చినుకల్లే నిలిపి దాచేయనా!

చేపమల్లే కనులా నీవందే! ఓ ఒప్పులకుప్పా!
గాలమేసి చూపుల పట్టేయనా!

చిలకమ్మ పలుకులే నీవందే! ఓ కులుకులనడకా!
పండుచేయిస్తే చిటికెలో పలికేవా!

జాబిల్లి మొహమే మాడిందే! ఆ జిలుగులే సిగ్గా!
నా కళ్ళల్లో చూసి అట్టేపట్టేయనా!

No comments:

Post a Comment