రాముడు సీతను అగ్నిపునీత కమ్మని, మరోసారి అడవికీ పంపాడెందుకు అనే సంశయాలు ఒక గ్రూప్‌లో చూసి రాసిన కందాలు:
ఒసగితివి జయవిజయులకు
నొసగిన రాక్షసజన్మ నొసగుటనేలా!
కసిగను రావణుడేటికి?
మోసము లేదే జగతిని మోక్షమదియేన్!
రామా నీకే చెల్లును
భామను అగ్నిని నిలుపగ భారము గాదే!
ఏమా ధీమా రామా?
రామాయని సీత బిలువ రావటె వానల్!
కానల వదలక నడిచీ
వానల వెరవక వెదకిన వానరులనరే
ఆనలు మీరరు నెవ్వరు
ఆనక ధర్మము తెలిసిన వారలెయంతన్!
కానల బంపెడు రోజున
కనరాదందురు కరుణయు కనులను నీకున్
మానక నీవే ధర్మము!
కానగ యేదో తెలియని కారణముండున్!
పంపితివట నీ పడతిని
పంపిన చోటే తెలియక పంపవు నీవే
పంపిన వాల్మీకి వరము
పంపినదెవరో తెలుసని పంపితివేమో!
చంపిన దైత్యులు మొక్కిరి
పంపిన సీతమ్మ మొక్కె పండుగ తనకున్!
పంపిన నీకేది సుఖము
వంపిన కనునీరు నీది వంకలు జేయున్!
No comments:
Post a Comment