Friday, August 19, 2016

ధర్మ రూపం

మారాడక సీత సాగె
మరుడియడుగు జయవిజయుల మరకల తీయన్!
శరము దునుమ పదితలలును
మరవవు తమ శాపనిహతి మరిమరి గనగన్!

రామా నీకే చెల్లును
భామను అగ్నిని నిలుపగ భారము గాదే!
ఏమా ధీమా రామా?
రామాయని నాతి బిలువ రాయే మారెన్!

కానల బంపెడు రోజున
కనరాదందురు కరుణయు కనులను నీకున్
మానక నీవే ధర్మము!
కానగ యేదో తెలియని కారణముండున్!

పంపితివట నీ పడతిని
పంపిన చోటే తెలియక పంపవు నీవే
పంపిన వాల్మీకి వరము
పంపినదెవరో తెలుసని పంపితివేమో!

కానల వదలక నడిచీ
వానల వెరవక వెదకిన వానరులనరే
ఆనలు మీరరు నెవ్వరు
ఆనక ధర్మము తెలిసిన వారలె రామా!

No comments:

Post a Comment