Saturday, August 6, 2016

అవధానఝరి

గలగల మాటల ఝరులు
జలజల దూకుచు కదలగ, జటిలపు కవులున్
విలవిల మనియడి ధారణ
మలవిని మెరిపించె పద్యమలరగ కనరే!

కనినను కలములు కదలవు
వినినను తన విలువ కవిత విజయమున గనన్
కనివిని కననివి కనగను
కనికరమున కదల తెలుగు, కనులును కదిలెన్!

హరిదరి దలచెడి కరిగని,
హరి సిరిముడి విడివడి అరిహరణకు రాగన్!
హరిగన మకరము వెరవదు
హరి గనుసిరి, కరి మకరి కిహపువరము గదే!

సిరిగని‌, శిరమున సరములు
సిరిగలహరి నిలుప సరససిరిమది సిరులే!
సిరిమురిసి  కురులసిరులను
సిరియని నిలసిరులకొసగ, సిరివరులెవరే!

No comments:

Post a Comment