తెలుగు మాటలు
ఎక్కడో వెలుగుతాయని
నోటిలో నలుగుతాయని
గోటితో కలుగులోతోసే
పరభాషా చదువు వ్యాపారాల్లో
భాషను కనుమరుగు చేసే లోకంలో
సభావేదికల మాటల్లా కాక,
సభనేలే బాలల మాటలకై
మనబడి వినీలాకాశంలో
ఆగక నడిచే తెలుగుతారలు మీరు!
గుండెల్లో దొరలిందని
అండల్లే నిలవాలనుందని
ఎండైనా వానైనా
ఎడదల్లో బరువున్నా
ఆగక అడుగులనేసి
దాగిన తెలుగును తీసి
ఆగని వెలుగును చూసి
వెలిగే బాలలను చేసి,
ఆనందం అందులోనే చూసే
అందరం ఆనందంగా చేసే
నిజవెలుగులు
భాషాసేవకులైన
తెలుగు తారలు మీరు!
No comments:
Post a Comment