Wednesday, July 20, 2016

దైనికరాగం

కిటికీ చీల్చుకుచూసే కిరణాలు
నిలకడగా తలగడపై
తట్టేస్తూ కనుతలుపుతీస్తూ
ధూళితో జతగా ఆడీపాడే
భూపాల ప్రభాతరాగం!

దారి పక్కన మల్లెపూలు
గుత్తులు గుత్తులుగా
గుబాళిస్తూ, పరవశిస్తూ
గాలి తమగళమై పాడే
మోహన సరాగరాగం !

సందియ వందలకాంతులు
చిత్తరువుల చివురులుగా
ఆకాశపు అందంమెరిపిస్తూ
సూర్యునితో హోళీ అడే
వసంత వాహినీరాగం!

No comments:

Post a Comment