నమ్మకం అపనమ్మకం మధ్య
ఆపసోపాలు పడుతున్న మనసు
ఇంకో రెండక్షరాలెందుకులే అనుకుని
మొదటిదాంతో సర్దుకు కూర్చుంది!
విశ్వాసం అవిశ్వాసం మధ్య
అష్టకష్టాలు పడుతున్న కన్నీరు
ఇంకో అక్షరం నాకెందుకులే అంటూ కదలి
మొదటిదాన్ని శ్వాసగా మార్చుకుంది!
అభిమానం అవమానం మధ్య
పరువుకు గడుపుతున్న జీవితం
రెండింటిలో కదపలేని అక్షరాలకేసి చూసి
మొదటిదాంతో క్షరంకాని మనిషై మసలుకుంది!
No comments:
Post a Comment