తరూలతలను తాకి
తదేకంగా తలవంచుకు నేలను చూస్తూ
పలకరింపుకోసం జారుతున్న
ముత్యంలాంటి వేకువజల్లులో
ఎంత వినయం! ఎంత సిగ్గు!
మహీరుహంబులను ఊపి
తమవేననే గాలికబుర్లు వినే కొమ్మల వీస్తూ
తొలిపలకరింపుకోసం వెళుతున్న
సుప్రభాతంలాంటి ప్రాతఃసమీరంలో
ఎంత ఆప్యాయత! ఎంత కలుపుగోలు!
ధరణీతలంబున ఆగి
తనపై ఉలిపోట్లకు ఓడక, తననే వేడే రూపాల పుట్టిస్తూ
తను కదలక మనల్ని నడిపిస్తున్న
పాషాణపు దయార్ద్రహృదయంలో
ఎంత ఓర్పు! ఎంత దైవత్వం!
No comments:
Post a Comment