ఖైరతాబాదు పెద్దవాణ్ణి వేసేందుకు ఒకరిద్దరు సరిపోరేమో, అందర్నీ మోసేందుకు ఒక ఇరవై రాయలసీమ సుమోలు, పది లాతూరు లారీలు, పోలవరం ప్రొక్లెయిన్లు, కొల్లేరు క్రేన్లు తెప్పించండి. 500మంది తో ప్రతిచోట మనుషులు వెనకే ఉండి వదలక పొజిషనింగ్, అలసిపోకుండా సింగింగ్ డాన్సింగ్ వెనక పెట్టండీ, సింగ్ నింగ్ అన్నానని వాళ్ళు పంజాబీలు చైనావాళ్ళు కారు సుమీ! గల్లీ గల్లీకి గలభాచేయటానికి రంగుల్లో జనం, ఎవ్వరినీ గుర్తుపట్టలేనంత రంగేయండి, హుసేన్ సాగర్ దగ్గర ఇంకో యాభైమందిని పెట్టండి. ఎవ్వరూ దాటడానికి వీల్లేదు. ఎవరన్నా దాటితే వేసేయండి వాళ్ళని (లెక్కెట్టుకునే). పెద్దాయన్ని దండంపెట్టుకుని వేసేశాక పెద్ద సౌండొస్తుంది, అది ఎప్పుడొచ్చేదే భయపడమాకే. మరో దండంపెట్టుకుని నాకు మిస్‌డ్ కాలివ్వు, అలజడి తగ్గాక వచ్చి డబ్బులు పట్టుకుపో. (వినాయకుడు అతడు ప్లాన్)
No comments:
Post a Comment