నువ్వే మాలక్ష్మివని
మా తోడున అక్కవని
ఎదిగిన రోజున అందరి
ఎదలను నవ్వాగెనెలా?
నీదీ ఒక ఊపిరని
నీకున్నవి విలువలని
నీతోడై నడిచిన రోజున
నడకలలో కలవరెలా?
నీ గుండెయే మెత్తనని
అది గుచ్చిన కందునని
ఎదురున గురివింజలలా
తన పోటుల మాటలెలా?
తనదని తిరిగొచ్చెనని
మలిమెలికన తోడుయని
తన ఇంటనే తిరుగాడిన
ఏ నాన్నకు ఏడుపెలా?
తనకున్నవి తిత్తులని
తన కూతురి భర్తకని
తను వరమిచ్చే దేవుడైనా
తన కూతురు నడగడెలా?
తన పెనిమిటి డబ్బులని
తను మారిన వీడు మబ్బులని
తపనతో సరిచేసిన
తరుణికి దొరకదే వరములలా?
తన కాలికి మెట్టెలని
తొలి గురుతుగ పెట్టెనని
తలచిన ఆ మనసుగతే
తనదగ్గర చేర్చెనిలా!
మనసులు కలిసే రోజు
బతుకుల కలగను రోజు
మహిలో మధురిమ తెలిసిన
కలిసిన బతుకులే రోజూ!
No comments:
Post a Comment