ఇదే స్నేహం
ఇదే మోహం
ఇదే వెలుతురు
ఇదే చీకటి
ఇదే తీర్థం
ఇదే స్వార్థం
ఇదే?మతము
మానవతము
మనసు హితము
మన సహితము
హిందూ మతము
అల్లా హితము
మంచి తడిసిన
మనసు జతిలో
మనిషి తెలిపే
మనసు సితము!
*******************
*
ఏ దేవుని వరమైనది స్నేహం!
ఏ దేవుని వరమైనది స్నేహం!
మానవతే మెలిపెట్టిన దారం!
కలయికలో మతాలకే దూరం!
కనికట్టుకు కనుకుట్టే స్నేహం!
మెలిపెట్టని మనసులదీ స్నేహం!
"ఏ దేవుని"
*
గుడితీర్థమిచ్చిందా స్నేహం
నమాజున పక్కనుందా నేస్తం!
ఎవరినడిగి పెరిగిందీ ప్రేమా!
ఎవరికొరకు ఆగేదీ జన్మా!
పూలజడన చూపిన ఆ ప్రేమా
అలజడిలో కనలేనిదమ్మ!
ఖీరుపెట్టు చేతులలో ఆ జానూ
కాలుకడుగు రొజేమాయనయ్యా!
*
పుట్టుకలో అమ్మనొప్పి నాపిందా ఏ దైవం!
చచ్చాకను మట్టిలోన కలివనిదా ఈ రూపం!
ప్రాణాల కాపలావాడు మతమేదో తెలియనోడు!
ప్రాణాలు కాపాడేనాడు కులమేదో అడగరాడు!
"ఏ దేవుని"
*
పెరిగేందుకు చేయిచ్చిన పూబాల ఇది!
కలిసేందుకు తనుమారిన కనరాని నది!
నడిచేందుకు తోడొచ్చినా కనరాదు విధి!
జడిసేందుకు నీడెక్కడని అనలేని మది!
"ఏ దేవుని"
*
చదరంగపు పావులతో కలిసినావా?
చరమాంకపు తోడులతో కలవలేవా?
మతమంటల మనసులలో వెన్నెలేది?
చితిమంటల తలపులలో మిన్నులేవి?
పసిమనసుల ఆశలనే పెంచి పెంచి
కసిగుండెల శ్వాసలుగా దించి తుంచి
బతుకంటే బరువయ్యే కాలం
నువు కదిలితే కళ్ళల్లో గోళం
"ఏ దేవుని"
No comments:
Post a Comment