Friday, October 7, 2016

కాలేజీ కలలు

కష్టాలెన్నో యున్నను
ఇష్టాలన్నీ అటకన ఇంజనిరింగే
నష్టాలేవీ లేవని
ఇష్టానికి మిత్రులిచ్చెనిలనే తెలియన్!

దొరికిన ఎన్సీసీకై
ఉరికిన ఆర్డీసి పరుగులు ఉరముకు మేలే
దొరికినదంతయు పట్టిన
దొరికిన ఆనందమంత దొరికినదచటన్!

కన్నులు నేలకు నిలుపుట
కన్నెల గొడవలు కలవక కన్నీరవకన్
వన్నెల జెండా నెత్తుట
మిన్నుల జేరను మురియుట మిగులుగ దొరికెన్!

లెక్కల మాస్టారి గొడవలు
పక్కన హాస్టలున లేని పరుగే పరుగున్!
ఎక్కడ యున్నను మిత్రులు
చుక్కలజూపిన చదువులు చుట్టములేలే!

విలువల మనుషుల మధ్యన
వెలుగుల వార్డెను గలిసిన వెతలెన్నెన్నో
తెలుగును తడిమిన వారూ
తెలుపగ కదలిన చదువరి తెలవారగనే!

అందరికందరు ఘనులే
ముందరి విద్యల మనసులు ముందర చదవన్!
పొందగ పసిడికి దారులు
అందము అక్కడ మొదలుగ అందుట తెలిసెన్!

చెప్పగ వినమే వినమా
తప్పక చెప్పిన వినుటయు తప్పనియెదమా!
ఒప్పని రసాయనమనే
చెప్పగ శ్రద్ధగ వినెదము చెవులకునింపున్!

నిండుగ తినినది లేదూ
మెండుగ నిద్రను తడవటమెందుననేదే!
దిండుగ పుస్తకమెట్టుకు
పండుగ సెలవుల కలగన పంతులు లేపే!

No comments:

Post a Comment