Sunday, October 2, 2016

ఓ మహాత్మా!

పుట్టితివట భారతమున
గట్టిగ మొదలెట్టినట్టి గమనము నీదే
పట్టియు శాంతియహింసలు
మట్టిని విడిపించినావు మహాత్ముడీవే!

దండిగ జనులే నీతో
దండిన నుప్పుకు నడిచిన దంతయు గనినన్!
దండలు వేయవె జేతులు
దండము బెట్టక వదలరు దండన దొరలున్!

కట్టిన బట్టను వడికెను
పట్టిన గట్టెను వదలక పథముల గదిలెన్!
కొట్టిన జెంపను జూపెను
గట్టిగ బట్టిన మనసున గమ్యము జేర్చెన్!

No comments:

Post a Comment