రెప్పతెరిస్తే ముందర ఎన్నో రూపాలు
చూడంటూ తిరుగాడుతున్నాయి
కానీ కళ్ళు చూడాలనుకుని
కొన్నింటినే వెదుకుతున్నాయి!
నేనూ నేనంటూ తిరిగే
నైజాల నియమాలు తెలీక
రెప్పతాకని రేతిరిచూపులు
కలల్ని ఆశ్రయిస్తున్నాయి!
కలల్లో మళ్ళీ ఎన్నో రూపాలు
తెలిసినవి కొన్నీ
తెలియనివి ఎన్నో!
నీకు తెలీని నిన్నే
నీకోసం నిద్దరబుచ్చి
నిజమని భ్రమింపజేస్తున్నాయి!
పుట్టుక పగలైతే
కట్టెల రాత్రైతే
మళ్ళీ పగలేదని
ప్రశ్నించే జీవితకాలం
రోజుకు సమాంతరంగా
ఆయుష్షు పోసుకుంటోంది!
కళ్ళు కొన్నింటినే వెదుకుతున్నాయి!
కలలు కొన్నింటితోనే బతుకుతున్నాయి!
"ళ" మెలికల్ని విప్పుకుని
మరో పగలులో సమాధానం వెదుకుతోంది!
తత్వమసి!
No comments:
Post a Comment