Sunday, October 2, 2016

తొలిచే ప్రశ్నలు

కళ్ళల్లో ఏదో వెదుకుతూ
ఏళ్ళయినా తేలని నిజాలు
ఊళ్ళెన్నో దాటిన ఇజాలు

ఉరికై గొంతుకు బిగిసిన ఉచ్చులా
వదలని కొందరి ఆఖరి ఊహలు!

పెల్లుబికిన కన్నీళ్ళలో
చెప్పకదాగిన ప్రశ్నలివేలే?

గెలిచిన కాశ్మీరం యుద్ధం
భూమిని వదిలిందెందుకు?

వదిలేసిన భూమిని మళ్ళీ
తెచ్చుకోని విజయాలెందుకు?

నిరాడంబరుడు లాల్‌బహదూరు
తాష్కెంటులో విగతమైందెందుకు?

నేతాజీ ఎగిరిన విమానం
ఎదిగిన మనిషిని దింపిందేది?

మహాత్ముని మంచితనమే
మనకు యాభైయేళ్ళదూరం
గాంధీలనిచ్చిందెందుకు?

వేళ్ళూనిన అస్తమించని సామ్రాజ్యం
వేళ్ళు పీకింది ఎడ్వినా నెహ్రూనా?

సంజయుడెగిరిన విమానం
సింధియా రాజేష్‌పైలటు
ఫిరోజులంతా పోయిందెలా?

ఢిల్లీలో గల్లీల్లో
సిక్కులను చంపిందెవరు?

యువరక్తం నిస్వార్థత్వం
చనిపోతే చరిత్రసారం
చట్టాలూ వారికి చుట్టాలు
అడగని ఈ అనంతప్రశ్నలు
దొరకని ఏ నిజానిజాలు
దొరికేటి మార్గాలేవి?

ఉరికేటి రక్తంనిండా
వదిలేయని ప్రశ్నలతో
సాగినదీ సగం జీవితం!

No comments:

Post a Comment