Friday, December 25, 2015

మన శరీరం

కాలు కదిల్తే
మంచీ చెడూ దార్ల
కలివిడిలోనే ప్రయాణ భారం
చేయి తిరుగుటకు
చేయి చాచుటకు
కరవడిలో ఒకటే దూరం
చేయి లేస్తే
అభయం భయం
కదలుటకొకటే ఆధారం
మస్తిష్కంలో కదిలే
అక్కర, ముక్కల ఆలోచనల
కట్టడికొకటే తీరం
అవసరాలకై కదిలి
అది నాది, తుది ఏదని
వెదికేందుకు ఈ శ్రమ ధారం
కలిసి బతికేందుకు చేరాం
కలవకపోతే ఆనందం దూరం
కదలాల్సిన దూరం
కనులముందేనని చూపే శరీరం
కలిగున్నామని తెలుసుకోవటమే ఒక వరం!