Wednesday, October 19, 2016

మోక్ష హరి

సురలే వేడిరియనుకొన
కరిమకరములే కనుమను కథలును లేవే!
వరమది హరినే తలచుట
శరణాగతిజొచ్చువారి శక్తే హరియున్!

సిరి తానొచ్చిన నొచ్చును
కరిమొర వినగనె హరికిని కదలిక యొచ్చెన్
కరిగన కారుణ్యాక్షడు
సిరినే విడిచియు వచ్చెను సిరియన యదియేన్!

వచ్చెడి వాడే హరియని
వచ్చిన చచ్చెదనని తెలిసి వరముగ వేచెన్
వచ్చుట నాపడు హరియే
ఇచ్చెను మోక్షము మకరికి ఇలవేలుపుగాన్!

కరుణను దొరికిన సుధయే
సురలకు వెతలగు కథలున సూక్ష్మత తెలిపెన్!
తరుణోపాయము హరియే
మరణపు తలుపుల నిలిచెడి మనుషులకిలలోన్!

Sunday, October 16, 2016

రామా రామా

రమమగు నామము నొదలక
మముగావగ రమ్మని నిను మక్కువ బిలవన్!
రమమును జేయగ వచ్చే
తమసము తొలగే తరుణము తనమది జేరెన్!

రామా! వెళ్ళకుమన్నను
రామా! నాకును వలదిది రాజ్యముయన్నన్!
రాముడు వదలడు ధర్మము
రామా! నీవే కనులకు రాజిలు ధర్మమ్!

సీతయు అడవులకేగెను
భ్రాతయు వదలడు పదముల భ్రాతృత్వమదే!
కోతయె గుండెలకైనను
జాతకధర్మము నొదలరు జాగేగనమే!

మధురపు మాటలు రామా!
అధరము తాకిన తదుపరి మధురము మనసే
వధువుగ లక్ష్మియె సీతగ
మధురపు బంధము కలిసిన మధురమె మధురం!

Saturday, October 15, 2016

ఇంటి మాలక్ష్మి

నువ్వే మాలక్ష్మివని
మా తోడున అక్కవని
ఎదిగిన రోజున అందరి
ఎదలను నవ్వాగెనెలా?

నీదీ ఒక ఊపిరని
నీకున్నవి విలువలని
నీతోడై నడిచిన రోజున
నడకలలో కలవరెలా?

నీ గుండెయే మెత్తనని
అది గుచ్చిన కందునని
ఎదురున గురివింజలలా
తన పోటుల మాటలెలా?

తనదని తిరిగొచ్చెనని
మలిమెలికన తోడుయని
తన ఇంటనే తిరుగాడిన
ఏ నాన్నకు ఏడుపెలా?

తనకున్నవి తిత్తులని
తన కూతురి భర్తకని
తను వరమిచ్చే దేవుడైనా
తన కూతురు నడగడెలా?

తన పెనిమిటి డబ్బులని
తను మారిన వీడు మబ్బులని
తపనతో సరిచేసిన
తరుణికి దొరకదే వరములలా?

తన కాలికి మెట్టెలని
తొలి గురుతుగ పెట్టెనని
తలచిన ఆ మనసుగతే
తనదగ్గర చేర్చెనిలా!

మనసులు కలిసే రోజు
బతుకుల కలగను రోజు
మహిలో మధురిమ తెలిసిన
కలిసిన బతుకులే రోజూ!

Tuesday, October 11, 2016

ధనమదం

నీతోనే పుట్టిందా ధనమదం

ఏమైనా తట్టిందా జనహితం!

నీడంటూ పోగేసే ప్రతిగజం

ఎండంటూ తాకనిదే! అది నిజం! 

"నీతోనే” 

---

ఎవరైనా తట్టారో  ఇవ్వడం

అటుపైనా గిట్టారో తవ్వడం

గిరిగీసి అప్పిచ్చే ఈ పని

విరిచేసి నొప్పించదా నీవని

"నీతోనే" 

----

నీతోనే నడిచొచ్చిన ఆడది

నేనంటూ కలిసొచ్చిన తోడది

నువ్వే కావాలనే అడుగది

మువ్వై కలవాలనే సడియది!

"నీతోనే" 


నీచుట్టూ దేవుడిలా తిరగడం

కలిసుంటే చాలంటూ అడగడం

ఆ తండ్రికి బతుకంటూ కదలడం

తెలుసంటా, మనసుంటే నిలపడం

"నీతోనే"

-----

నువ్వేంటో చూపించే అవసరం

నువ్వంటూ కదలలేని నిర్ణయం

నీకైనా తెలిసేనా ఆ క్షణం

నీడల్లే తోడెవరో ప్రతిక్షణం

"నీతోనే"

-----

నువ్వే నాకంత అనే ఆ నిధి

నువ్వెంత నాకన్నదలే ఆ విధి

నువ్వులతో వదలమాకు ఆ సిరి

నీవెంటే కదులుతోంది చూడు మరి! 

"నీతోనే"వతం!

నీడంటూ పోగేసే ప్రతిగజం

ఎండంటూ తాకనిదే! అది నిజం! 

"నీతోనే” 

---

ఎవరైనా తట్టారో  ఇవ్వడం

అటుపైనా గిట్టారో తవ్వడం

గిరిగీసి అప్పిచ్చే ఈ పని

విరిచేసి నొప్పించదా నీవని

"నీతోనే" 

----

నీతోనే నడిచొచ్చిన ఆడది

నేనంటూ కలిసొచ్చిన తోడది

నువ్వే కావాలనే అడుగది

మువ్వై కలవాలనే సడియది!

"నీతోనే" 


నీచుట్టూ దేవుడిలా తిరగడం

కలిసుంటే చాలంటూ అడగడం

ఆ తండ్రికి బతుకంటూ కదలడం

తెలుసంటా, మనసుంటే నిలపడం

"నీతోనే"

-----

నువ్వేంటో చూపించే అవసరం

నువ్వంటూ కదలలేని నిర్ణయం

నీకైనా తెలిసేనా ఆ క్షణం

నీడల్లే తోడెవరో ప్రతిక్షణం

"నీతోనే"

-----

నువ్వే నాకంత అనే ఆ నిధి

నువ్వెంత నాకన్నదలే ఆ విధి

నువ్వులతో వదలమాకు ఆ సిరి

నీవెంటే కదులుతోంది చూడు మరి! 

"నీతోనే"

Sunday, October 9, 2016

స్నేహమతం

ఇదే స్నేహం
ఇదే మోహం

ఇదే వెలుతురు
ఇదే చీకటి

ఇదే తీర్థం
ఇదే స్వార్థం

ఇదే?మతము
మానవతము

మనసు హితము
మన సహితము

హిందూ మతము
అల్లా హితము

మంచి తడిసిన
మనసు జతిలో
మనిషి తెలిపే
మనసు సితము!
*******************

*
ఏ దేవుని వరమైనది స్నేహం!
ఏ దేవుని వరమైనది స్నేహం!

మానవతే మెలిపెట్టిన దారం!
కలయికలో మతాలకే దూరం!

కనికట్టుకు కనుకుట్టే స్నేహం!
మెలిపెట్టని మనసులదీ స్నేహం!

"ఏ దేవుని"

*
గుడితీర్థమిచ్చిందా స్నేహం
నమాజున పక్కనుందా నేస్తం!
ఎవరినడిగి పెరిగిందీ ప్రేమా!
ఎవరికొరకు ఆగేదీ జన్మా!

పూలజడన చూపిన ఆ ప్రేమా
అలజడిలో కనలేనిదమ్మ!
ఖీరుపెట్టు చేతులలో ఆ జానూ
కాలుకడుగు రొజేమాయనయ్యా!

*
పుట్టుకలో అమ్మనొప్పి నాపిందా ఏ దైవం!
చచ్చాకను మట్టిలోన కలివనిదా ఈ రూపం!

ప్రాణాల కాపలావాడు మతమేదో తెలియనోడు!
ప్రాణాలు కాపాడేనాడు కులమేదో అడగరాడు!
"ఏ దేవుని"
*
పెరిగేందుకు చేయిచ్చిన పూబాల ఇది!
కలిసేందుకు తనుమారిన కనరాని నది!

నడిచేందుకు తోడొచ్చినా కనరాదు విధి!
జడిసేందుకు నీడెక్కడని అనలేని మది!
"ఏ దేవుని"
*

చదరంగపు పావులతో కలిసినావా?
చరమాంకపు తోడులతో కలవలేవా?

మతమంటల మనసులలో వెన్నెలేది?
చితిమంటల తలపులలో మిన్నులేవి?

పసిమనసుల ఆశలనే పెంచి పెంచి
కసిగుండెల శ్వాసలుగా దించి తుంచి
బతుకంటే బరువయ్యే కాలం
నువు కదిలితే కళ్ళల్లో గోళం

"ఏ దేవుని"

వీక్షణం

తక్షణము రమ్మన నాకే
శిక్షణయులేదే కవితకు శిక్షయను కొంటిన్
శిక్షణము వీక్షణమనియే
తక్షణమిటుల చేరుకొంటి తరమగ తెలుగే!

ఒకటో రెండో కావవి
ఒక యాభై కలయికలన నొచ్చిన మనసే
ఇక పద విని కను మనగా
నొక పదముల కందమందె నొచ్చక వినుడీ!

తెలుగును తడిమిన దొరలే
వెలుగుల భాషంటు పొగడ వెతకకు ఋజువే!
తెలుగన తరమగ వచ్చెడి
తెలుగుకు భక్తుల తపనను తెలియగలేమా!

వరముల భాషని తెలుసు
సరముల ముత్యాలవిరులు సరిగొన తెలుసున్!
వరముల ఛందములుండగ
శిరముల దిగనిది కవితని శితిగనె తెలుసున్!

Saturday, October 8, 2016

కొమ్ము తీస్తే

కలంరాసే కులం
కొమ్ము తీసి రాసేస్తే

జలందాచే జులుం
కొమ్ములు తీసేస్తే!

మనసులేని మనిసి
గుడికొట్టేసి తలకట్టేస్తే!

తత్వమసి

రెప్పతెరిస్తే ముందర ఎన్నో రూపాలు
చూడంటూ తిరుగాడుతున్నాయి
కానీ కళ్ళు చూడాలనుకుని
కొన్నింటినే వెదుకుతున్నాయి!

నేనూ నేనంటూ తిరిగే
నైజాల నియమాలు తెలీక
రెప్పతాకని రేతిరిచూపులు
కలల్ని ఆశ్రయిస్తున్నాయి!

కలల్లో మళ్ళీ ఎన్నో రూపాలు
తెలిసినవి కొన్నీ
తెలియనివి ఎన్నో!
నీకు తెలీని నిన్నే
నీకోసం నిద్దరబుచ్చి
నిజమని భ్రమింపజేస్తున్నాయి!

పుట్టుక పగలైతే
కట్టెల రాత్రైతే
మళ్ళీ పగలేదని
ప్రశ్నించే జీవితకాలం
రోజుకు సమాంతరంగా
ఆయుష్షు పోసుకుంటోంది!

కళ్ళు కొన్నింటినే వెదుకుతున్నాయి!
కలలు కొన్నింటితోనే బతుకుతున్నాయి!
"ళ" మెలికల్ని విప్పుకుని
మరో పగలులో సమాధానం వెదుకుతోంది!
తత్వమసి!

Friday, October 7, 2016

బల్లలకే కాళ్ళొస్తే

బల్లలకే కాళ్ళొస్తే
మెల్లగబెట్టితి ననుకొను మెచ్చే కాఫీ
చల్లగ జారిటుపడెనే
తెల్లటి కప్పెక్కడనగ తెలతెలబోయెన్!

బల్లలకే కాళ్ళొస్తే
గుల్లగు జేబులు తడిమిరి గుమ్మము బయటన్!
చిల్లర చేతులు తడవక
మెల్లగ జరిగినది ఫైలు మెచ్చరు ఎవరున్!

అరిచే రోజా నిలువగ
చరిచే నాయకుల నిలుపు చలనము లేదే
చరిచిన బల్లలు కదిలిన
విరివిగ దొరుకునవి గనరు విసరగలేరే!

బల్లలకే కాళ్ళొస్తే
పిల్లలు వెంటనె వదలగ పిచ్చివి బడులే!
కల్లలు నామాటలనిన
ఒల్లము రామని పరుగిడ ఒజ్జల గనరే!

బల్లలకే కాళ్ళొస్తే
జల్లను పడతుల మనసులు జరిగిన టీవీన్!
ఇల్లున దేదియు గనినను
చిల్లుల సొట్టల విసిరిరి చివరికి టీవీన్!

కాలేజీ కలలు

కష్టాలెన్నో యున్నను
ఇష్టాలన్నీ అటకన ఇంజనిరింగే
నష్టాలేవీ లేవని
ఇష్టానికి మిత్రులిచ్చెనిలనే తెలియన్!

దొరికిన ఎన్సీసీకై
ఉరికిన ఆర్డీసి పరుగులు ఉరముకు మేలే
దొరికినదంతయు పట్టిన
దొరికిన ఆనందమంత దొరికినదచటన్!

కన్నులు నేలకు నిలుపుట
కన్నెల గొడవలు కలవక కన్నీరవకన్
వన్నెల జెండా నెత్తుట
మిన్నుల జేరను మురియుట మిగులుగ దొరికెన్!

లెక్కల మాస్టారి గొడవలు
పక్కన హాస్టలున లేని పరుగే పరుగున్!
ఎక్కడ యున్నను మిత్రులు
చుక్కలజూపిన చదువులు చుట్టములేలే!

విలువల మనుషుల మధ్యన
వెలుగుల వార్డెను గలిసిన వెతలెన్నెన్నో
తెలుగును తడిమిన వారూ
తెలుపగ కదలిన చదువరి తెలవారగనే!

అందరికందరు ఘనులే
ముందరి విద్యల మనసులు ముందర చదవన్!
పొందగ పసిడికి దారులు
అందము అక్కడ మొదలుగ అందుట తెలిసెన్!

చెప్పగ వినమే వినమా
తప్పక చెప్పిన వినుటయు తప్పనియెదమా!
ఒప్పని రసాయనమనే
చెప్పగ శ్రద్ధగ వినెదము చెవులకునింపున్!

నిండుగ తినినది లేదూ
మెండుగ నిద్రను తడవటమెందుననేదే!
దిండుగ పుస్తకమెట్టుకు
పండుగ సెలవుల కలగన పంతులు లేపే!

Sunday, October 2, 2016

తొలిచే ప్రశ్నలు

కళ్ళల్లో ఏదో వెదుకుతూ
ఏళ్ళయినా తేలని నిజాలు
ఊళ్ళెన్నో దాటిన ఇజాలు

ఉరికై గొంతుకు బిగిసిన ఉచ్చులా
వదలని కొందరి ఆఖరి ఊహలు!

పెల్లుబికిన కన్నీళ్ళలో
చెప్పకదాగిన ప్రశ్నలివేలే?

గెలిచిన కాశ్మీరం యుద్ధం
భూమిని వదిలిందెందుకు?

వదిలేసిన భూమిని మళ్ళీ
తెచ్చుకోని విజయాలెందుకు?

నిరాడంబరుడు లాల్‌బహదూరు
తాష్కెంటులో విగతమైందెందుకు?

నేతాజీ ఎగిరిన విమానం
ఎదిగిన మనిషిని దింపిందేది?

మహాత్ముని మంచితనమే
మనకు యాభైయేళ్ళదూరం
గాంధీలనిచ్చిందెందుకు?

వేళ్ళూనిన అస్తమించని సామ్రాజ్యం
వేళ్ళు పీకింది ఎడ్వినా నెహ్రూనా?

సంజయుడెగిరిన విమానం
సింధియా రాజేష్‌పైలటు
ఫిరోజులంతా పోయిందెలా?

ఢిల్లీలో గల్లీల్లో
సిక్కులను చంపిందెవరు?

యువరక్తం నిస్వార్థత్వం
చనిపోతే చరిత్రసారం
చట్టాలూ వారికి చుట్టాలు
అడగని ఈ అనంతప్రశ్నలు
దొరకని ఏ నిజానిజాలు
దొరికేటి మార్గాలేవి?

ఉరికేటి రక్తంనిండా
వదిలేయని ప్రశ్నలతో
సాగినదీ సగం జీవితం!

ఓ మహాత్మా!

పుట్టితివట భారతమున
గట్టిగ మొదలెట్టినట్టి గమనము నీదే
పట్టియు శాంతియహింసలు
మట్టిని విడిపించినావు మహాత్ముడీవే!

దండిగ జనులే నీతో
దండిన నుప్పుకు నడిచిన దంతయు గనినన్!
దండలు వేయవె జేతులు
దండము బెట్టక వదలరు దండన దొరలున్!

కట్టిన బట్టను వడికెను
పట్టిన గట్టెను వదలక పథముల గదిలెన్!
కొట్టిన జెంపను జూపెను
గట్టిగ బట్టిన మనసున గమ్యము జేర్చెన్!

Saturday, October 1, 2016

తెలుగు తెరలు

తెలుగే తెలుసని, తెలిసిన
తెలుగును పలకని తరువుల తెరలును తొలగే
తెలుగును తెలుగుగ పలుకగ
తెలుగే తడిసెను కనులను తెలిమది మురియన్!