Saturday, August 27, 2016

ధర్మ సంశయం

రాముడు సీతను అగ్నిపునీత కమ్మని, మరోసారి అడవికీ పంపాడెందుకు అనే సంశయాలు ఒక గ్రూప్‌లో చూసి రాసిన కందాలు:

ఒసగితివి జయవిజయులకు
నొసగిన రాక్షసజన్మ నొసగుటనేలా!
కసిగను రావణుడేటికి?
మోసము లేదే జగతిని మోక్షమదియేన్!

రామా నీకే చెల్లును
భామను అగ్నిని నిలుపగ భారము గాదే!
ఏమా ధీమా రామా?
రామాయని సీత బిలువ రావటె వానల్!

కానల వదలక నడిచీ
వానల వెరవక వెదకిన వానరులనరే
ఆనలు మీరరు నెవ్వరు
ఆనక ధర్మము తెలిసిన వారలెయంతన్!

కానల బంపెడు రోజున
కనరాదందురు కరుణయు కనులను నీకున్
మానక నీవే ధర్మము!
కానగ యేదో తెలియని కారణముండున్!

పంపితివట నీ పడతిని
పంపిన చోటే తెలియక పంపవు నీవే
పంపిన వాల్మీకి వరము
పంపినదెవరో తెలుసని పంపితివేమో!

చంపిన దైత్యులు మొక్కిరి
పంపిన సీతమ్మ మొక్కె పండుగ తనకున్!
పంపిన నీకేది సుఖము
వంపిన కనునీరు నీది వంకలు జేయున్!

Friday, August 26, 2016

నంద నందనా

నందుని ఇంటను తానా
నందము జేసే పనిగని నందను డొదిలే
నందని కొడుకును కనెనని
నందరు పలుమాటలాడ నందను డేడ్చెన్!

నందుని పేరును తనదిగ
పొందగ కదిలేను తాను పొందిక తనమున్!
నందునికా యంత ఘనత
నెందుకు? యెప్పటి మనవది నెంజిలి తొలగన్!

అందను ఇందును యుండెడు
నందనునొకపరి తను గననందుకు వెదికే
నందరి వాడల, వాడా
యందరి వాడల గళమిడు యంతటి వాడేన్!

Wednesday, August 24, 2016

వీనుల విను

వినియెడివి గానవిరులట
వినిపించెడి గళమది వినువినుమనెనట నే
వినినంతనె మదియనునే
విని వినునవి వరమని పెదవిని యనుమనునే!

Friday, August 19, 2016

ధర్మ రూపం

మారాడక సీత సాగె
మరుడియడుగు జయవిజయుల మరకల తీయన్!
శరము దునుమ పదితలలును
మరవవు తమ శాపనిహతి మరిమరి గనగన్!

రామా నీకే చెల్లును
భామను అగ్నిని నిలుపగ భారము గాదే!
ఏమా ధీమా రామా?
రామాయని నాతి బిలువ రాయే మారెన్!

కానల బంపెడు రోజున
కనరాదందురు కరుణయు కనులను నీకున్
మానక నీవే ధర్మము!
కానగ యేదో తెలియని కారణముండున్!

పంపితివట నీ పడతిని
పంపిన చోటే తెలియక పంపవు నీవే
పంపిన వాల్మీకి వరము
పంపినదెవరో తెలుసని పంపితివేమో!

కానల వదలక నడిచీ
వానల వెరవక వెదకిన వానరులనరే
ఆనలు మీరరు నెవ్వరు
ఆనక ధర్మము తెలిసిన వారలె రామా!

భారత స్వప్నం

అటునిటు కదలుటకదియే
కిటుకుల ఇరవది అడుగుల కిటునటు ఎగరన్!
కటువది నిలిచియు పోరుట
పటువున మాసింధు గెలుపుపథమున పోరెన్!

పట్టుమని ఇరవదేళ్ళ
కట్టుకుని పరిగిడువారి కనుకుట్టగనన్!
పట్టుదల జట్టుగ సింధు
పట్టుకురాగా పతకము, పరిణతి పొగడన్!

పుట్టుక ఆటల ఇల్లని
బెట్టుకు పోలేదు తాను, బెరుకే లేదున్!
కొట్టుకుపోయిన ఆశల
గట్టుకు చేర్చెను భరతగగనపు సింధున్!

మెట్టులు ఎన్నియు నెక్కిన
తట్టుకు పోగల తెలివిని తనకేనిమ్మా!
కొట్టుకు రాగల బంగరు
మట్టుకు సింధుగళమున సుమహారమవగన్!
(For PV Sindhu's achievements)

Thursday, August 18, 2016

రవీంద్ర సంగీత్

1.
https://www.youtube.com/watch?v=WdpavW0c9qY
Rakho rakho re jibone jibanballabhe
Pran mone dhari rakho nibir anando bandhone
Alo jalo hridoy dipe ati nibhrito antar majhe
Akuliya dau pran gandho chandone

తెలుగుసేత ప్రయత్నం

నీదే నీదే లేరే , ఈ జీవాన ప్రతిజీవీ జతగామీవే !
నా సారం భావం నీదరినేరే, సాంద్రమానంద బంధనమేలే
నను తాకే ఎదదీపశిఖలేరే, అవి తాకేనా ఎదమూలాలే,
నా మది చికిలించే ఆ సుగంధ బాంధవ్యాలీవే!



2. 
https://www.youtube.com/watch?v=5tMj9beMcis
మోరే బారే బారే ఫిరాలే| 
పూజాఫుల్ నా ఫుటిల్ దుఖ్ నిశా నా ఛుటిల్,
నా టుటిల్ ఆబ్రణ్ || 
జీబన్ భరి మాధురీ కీ శుభలగ్నే జాగిబే?
నాథ్ ఓహే నాథ్, కబే లబే తను మన్ ధన్?|


----
మదే మరలి మరలెలా అదే మలుపేగే    
పూజాపూలేలా పూతై వాడేలే,
తడీ రేయేలా కనులే వీడవులే,  
వెతలాభరణాలై ఏలా నన్నే విడలే!

జీవనభరిత మాధురేలా శుభలగ్న జామేదనేనే!

జోడీ నా జోడీ! ఏ జామున ఆ తనువు మనము ధనము నాదనేనే!

3.
https://www.youtube.com/watch?v=QUqJLJwoTd0
Gram chara oi ranga matir poth
Amar mono bhulay re.
Gram chara oi ranga matir poth
Amar mono bhulay re.
Ore kar pane mon hath bariye
Ore kar pane mon hath bariye
Lutiye jay dhulaye re amar mono bhulay re
Gram chara oi ranga matir poth
Amar mono bhulay re.
Oje amay ghorer bahir kore
Paye paye paye dhore
Mori hay hay re
Oje kere amay niye jay re
Jay re kon chulay re amar mono bhulay re
O kon bake ki dhon dekhabe
Kon khane ki daye thekabe
Kothay giye sesh mele je
Bebei na kulay re amar mono bhulay re
Gram chara oi ranga matir poth
Amar mono bhulay re.
Gram chara oi ranga matir poth
Amar mono bhulay re.

గ్రామపు చివరా ఎర్రమన్ను తివాచీ,
నా మనసే ఆరని గురుతుల తరలేనే!

ఓహ్! నామనసెవరికోసమై కరములు చాచే,
ఆ రాలేధూళిని గాలిలో తాకగ పొరలేనే!
ఆగని పిలుపులేవో నన్నింటి ముంగిలికి పిలిచి నిలిచేనే!నా పాదపు అంచుల మృదువుగ తాకుతు నాతో నడిచేనే!ఆపక అనామక దారులసాగే నేనేనమ్మిక నెరిగేనే!ఈ తెమలని మలుపుల, తెలియని గెలుపుల తరగని నిలుపుల పయనము తరలేనే!అంతిమగమ్యము ఎరుకకు దొరకగ మనసెటు సాగేనే ! గ్రామపు చివరి ఎర్రమన్ను తివాచీ, నామనసే మరుపుల మలుపులకై మరలేనే!

Monday, August 15, 2016

రాళ్ళపల్లి గారు

నోళ్ళను నవ్వులపూయించి
గోళ్ళను కొరికేటి నటన గొప్పగ జేయన్!
ఊళ్ళను చేసిన దాన
మిళ్ళను నిలబెట్టెనంట మిముగన వరమున్!

మౌన రాగాలు

మౌనంలోనూ ఒక చేతన
చేతనలోనూ కదలని మౌనాలెన్నో!

ప్రతి సుమానిదీ ఓ కథ
ఆ కథకూర్పరి మనసులోకి చేరే సుమాలెన్నో!

ప్రతి చదువరి అభిమానానిదీ ఒక్కో మాట
ఆ అభిమానాల తపనతో వీచే కవిహృదయాలెన్నో!

ప్రతి బాగోగులడిగే స్వరాల వెనకేదో ఆర్తి
ఆ ప్రతిధ్వనులు తెలుసుకు తరలే నివృత్తులెన్నో!

నిశ్చల నిశీధిలో నిజాలు వెదికే రెండు మండువాలు!
ఆ మండువా వెనక నిశీధీ, నిశ్చలతేంటో తెలియని మదిగదులెన్నో!

Sunday, August 14, 2016

భారతగాలి

బాహుబలులని విర్రవీగెడు
భానుడలవని భూమినేలెడు
బ్రిటిషురాజ్యపు బుర్ర కీర్తన
భిన్నరీతుల నొకటిజేసి
బిడ్డబిడ్డడు పాడినప్పుడు,

భారతావని పైనగాలులు
బానిసమ్ములపొదిని చూసి
బాపునడకన అడుగులేసి
భారతమ్మను అస్త్రాన్నితీసి
బయటివారల సాగనంపగ,

బెరుకులెరుగక ఎగిరె జెండా
బానిసత్వము నెరుకలేకను
భావితరముల భయములేదని
బాసజేసిన గులాబిబాబును
బాటనంపే ప్రజలరాజ్యం

బావుటాలవి బుగ్గతీపుల్కావట
బాపుకన్నది భయమునేలుట
భారతముపై ఉమ్మడియక్కరేకమై
బతికినావా బొందియంతను
బాపూలేవడా బాలుడా! భారతీయుడా!

Saturday, August 13, 2016

జానపదం 2

సన్నాని నడుము నీదందే! ఓ సిరిమల్లెమొగ్గా!
తీగల్లే అల్లుకు పోయేనా!

సొట్టాల బుగ్గలు నీవందే! ఓ ముత్యపు చిప్పా!
చినుకల్లే నిలిపి దాచేయనా!

చేపమల్లే కనులా నీవందే! ఓ ఒప్పులకుప్పా!
గాలమేసి చూపుల పట్టేయనా!

చిలకమ్మ పలుకులే నీవందే! ఓ కులుకులనడకా!
పండుచేయిస్తే చిటికెలో పలికేవా!

జాబిల్లి మొహమే మాడిందే! ఆ జిలుగులే సిగ్గా!
నా కళ్ళల్లో చూసి అట్టేపట్టేయనా!

పులికంటికి జానపదం

బుగ్గన ముద్దెడితే బుగబుగమంటాదే పిల్లా!
బుగబుగమంటాదే పిల్లా!

నుదుటాను ముద్దంటే నువ్వెవ్వరంటాదే పిల్లా!
నువ్వెవ్వరంటాదే పిల్లా!

కనులాపై ముద్దంటే కనబడవేయంటాదే పిల్లా!
కనబడవేయంటాదే పిల్లా!

చెవులాపై ముద్దంటే చెముడానీకంటాదే పిల్లా!
చెముడానీకంటాదే పిల్లా!

ఇంకెట్టాచచ్చేదే మరదాలా నేనంటే!
ఇంకోటిమరచేటి మెదడేనీదంటాదే పిల్లా!

అల్లల్లా గురుతొచ్చి,
పెదవూల ఇస్తనంటే పెనిమీటివంటాదే పిల్లా!
నువ్వే నా పెనిమిటివంటాదే పిల్లా!

Friday, August 12, 2016

ఛందో దర్పాలు

విద్యలేపరి నవ్వురాతల విచ్చుపూలుగ పంచెగా
గద్యరచనల డొక్క మా ఫణి గమ్యమేలిన వక్తగా
పద్యమేమన మెచ్చుమాటల పద్ధతీదని తిన్నగా
విద్యనొక్కటి మత్తకోకిల విత్తనాలుగ చల్లెగా!

అద్దికన అన్నమయ్యే
ఒద్దికనిచ్చె తన కుంచెలోవరమై స
న్నద్ధితుడై చిత్తరువులను
బుద్ధిగ మాకంటచూపె బుడతను రఘువే!

ఎవ్వనిచే జనించు జలమెవ్వనితాకగనుండు క్షీనమై
యెవ్వడు యందుడిందు పథమేగును యెప్పుడు, నాశకారణం
బెవ్వ డనాది మిధ్యలయు డెవ్వడు, సర్వము దానెయైన వా
డెవ్వడు వాని నాత్మసఖు నీబాబునే శరణంబు వీడనన్.

మాడిన లడ్డూ కాదది
వేడిగ ఉండలు మినుమువి వేరే కదునే!
గాడిగ ఉన్న పునుగు
లాడగ శెనగలదిమిన ఫలాఫలు లేమో!

కొబ్బరియుండల లడ్డులు
ఇబ్బడి ముబ్బడిగ  జూడ నిక నోరూరున్!
జబ్బల యువకుల జూడగ
నబ్బాయను తనయజూచి నమలగ జూసెన్!

ముక్కున ఎర్రది యొకటిని
అక్కున జేర్చంగ యొకటి అరమరికకొకన్
లెక్కన కాలికి ఎనిమిది
పక్కున నవ్వేటి దేది పదపోలారున్!

ధైర్యము మెండుగ కావలె
భార్యలవలె వదలక భారపు ధారా
కార్యక్రమముల జూడగ
నార్యులకది మడమవంచు నాతుల తంత్రం!

నిర్భయ మానము గావని
నిర్భాగ్యపు మనుషులగన నిర్బలులెవరే!
నిర్భయ చట్టములున్నను
నిర్భయముగ తిరుగలేరు నిర్భరమదియేన్!

ఎదలకు నాగిని మాధవి
వదలని భానుప్రియగతి వరము స్మితయున్!
నదియాల విజయశాంతుల
మదనపు రాధా సుమలత మలుపున రమ్యే!

రమ్యను గాంచగ బలగము
గమ్యము గానని మడతల కనుగననేలా!
రమ్యపు వయసున కొందరు
రమ్యారుణ వదనముగని రవినే గనిరే!

లఘువుగ చేతిని గీతల
లఘువులనే తెలుసుకొనుచు లక్ష్యము చేరెన్!
లఘువులు గురువుల ఛందము
రఘునాథుని కందమాయె రమ్యపు రీతిన్!

నుడివెదనని పలుమారుల
నుడివిన నామము మరువక నుడివితినేమో
నుడివిన మేలగునను నా
నుడి మదినిడి, నే నినుగన నుడివితినయ్యా!

చిత్తము మొత్తము నీవను
విత్తనమే మదినినాట విచ్చుక నేనై
పొత్తను మోతల నెత్తిన
పొత్తుగ దేవాదిదేవ! పొలిమెర నీవా?

ఎక్కడ పాపము జేసితి
దక్కని యాపుణ్యమేమి దరియే నీవై
చక్కగ కొలచిన దారుల
నొక్కటి గానను ఎటులను నొకపరి రావా!

బక్కగ నున్నను బలపము
పక్కన కూర్చోక నల్లబల్లల మెరయన్
చక్కగ వచ్చే లావగు
లెక్కలు ఎకసకియము విడి లెస్సగ కదిలెన్!

Saturday, August 6, 2016

అవధానఝరి

గలగల మాటల ఝరులు
జలజల దూకుచు కదలగ, జటిలపు కవులున్
విలవిల మనియడి ధారణ
మలవిని మెరిపించె పద్యమలరగ కనరే!

కనినను కలములు కదలవు
వినినను తన విలువ కవిత విజయమున గనన్
కనివిని కననివి కనగను
కనికరమున కదల తెలుగు, కనులును కదిలెన్!

హరిదరి దలచెడి కరిగని,
హరి సిరిముడి విడివడి అరిహరణకు రాగన్!
హరిగన మకరము వెరవదు
హరి గనుసిరి, కరి మకరి కిహపువరము గదే!

సిరిగని‌, శిరమున సరములు
సిరిగలహరి నిలుప సరససిరిమది సిరులే!
సిరిమురిసి  కురులసిరులను
సిరియని నిలసిరులకొసగ, సిరివరులెవరే!