Sunday, July 31, 2016

డా పిలుపులు

డా పిలుపులు
=========

వాడా వీడా అనుడే నేడా!
లేడా? నా గోడు వినే అరుణుడే తోడా?
ఆడా మగాడా మాడా అని ఈ "డా" కు లేదే తేడా?
ఈశుడా? దేవుడా? గురుడా? ఎవరూ దీనిని  ఆపగలేడా
రే వే బే రా డా, ఇదేనా సంభోదనల జాడ?
ఓ డా! నువు వీడే నాడే వదులును ఈ చీడ!
దేవుడా! ఈ డా ను తీసుకొని మాకు చూపుము తోడూనీడా!

Friday, July 29, 2016

పక్షి విహారం

తెలీని కోనలో,
ఓ కానా! కనరవా అంటే
ఎగిరే రెక్కల కోసం,
ఎన్నేళ్ళు ఆగానో
కథల్లాంటి కలల్ని
కళ్ళతలుపులు తెరిచి
తనివితీరా చూట్టానికి!

ఒక్కరోజు రెక్కలనిస్తే
చక్కగా ఎగిరే స్వేచ్చతో
కానలకథలను పోగేసి
కబుర్లమాలిక అల్లివ్వనూ ఇలా!

కనులముందు రెండుచెట్లు
కొమ్మబంధాల్తో కోటద్వారంలా
పచ్చటి ఆకుల ముందుగుమ్మంతో
పద్ధతిగా స్వాగతంచెప్పాయి!

ఒక ముదుసలి మాను
నేలపై వాలిపోయాక్కూడా
ఆకులనే మనుమల్ని ఎత్తుకుని
మొదటి అతిథినైన నన్ను
ఇంట్లోకి ఆహ్వానించింది!

తన ఒడిలో ఉన్న పిల్లఆకులు కొన్ని
గౌరవంగా గాలికి ఎగిరి
నాకు అవ్వ ఒడిలోకూర్చునే
అమరత్వపు చోటిచ్చాయి!

అంతలో వేళ్ళూనిన మరో మాను
ఆటకు రమ్మంటూ
ఊడను వదిలింది నావైపుకు
నేను పదమనేలోపలే
ఊయల ఆటలు!

ఆటలో అలసిపోతాననేమో
కొమ్మ వింజామరలు
నెమ్మదిగా వీస్తున్నాయి!

ఆగిచూస్తే వర్షపు బిందువు
ఆకుచాటున నాకోసం
ఎన్ని ఘడియలు వేచిచూసిందో పాపం
నన్ను చూస్తూనే ఆనందభాష్పమై రాలింది!

అంతలో అలసి దాహానికి చూస్తే
అప్పుడెప్పుడో పడ్డ వానలా వుంది
కలువ కొలనును చేసి
నా ఆనందబింబం చూసుకోమంది
నీ ఆర్తితీరే పూజలు నాదగ్గరేనంది!

నాలుగు అడుగులు గాల్లోవేస్తే
నలుదిక్కులా జలపాతాలు
పరవళ్ళ పాటల్లో మహతీరవాలు
పూలపడవల్లో పుప్పొడి ప్రయణాలు
నిటారుచెట్లను చీలుస్తూ రవికిరణాలు
గాలినడకకు మొక్కల సహగాత్రాలు
ప్రతిదీ అథిధి సత్కారాలు చేసేస్తుంటే
ఆ రూపాలతోడులో జీవితం గడిపేయాలనింది
సంధ్యాకాంతుల్లో కరిగే విహంగవరం తెలిసి
సంబరాన్ని చూసానన్న తృప్తితో  ఇంటికి చేరాను!

మళ్ళీ ఒక్కసారి విహంగాలు దొరికితే బాగుణ్ణు!
నా మానసికోల్లాస గీతం నేనే వెతుక్కుందును!

Tuesday, July 26, 2016

శ్వాసాక్షరాలు

నమ్మకం అపనమ్మకం మధ్య
ఆపసోపాలు పడుతున్న మనసు
ఇంకో రెండక్షరాలెందుకులే అనుకుని
మొదటిదాంతో సర్దుకు కూర్చుంది!

విశ్వాసం అవిశ్వాసం మధ్య
అష్టకష్టాలు పడుతున్న కన్నీరు
ఇంకో అక్షరం నాకెందుకులే అంటూ కదలి
మొదటిదాన్ని శ్వాసగా మార్చుకుంది!

అభిమానం అవమానం మధ్య
పరువుకు గడుపుతున్న జీవితం
రెండింటిలో కదపలేని అక్షరాలకేసి చూసి
మొదటిదాంతో క్షరంకాని మనిషై మసలుకుంది!

Wednesday, July 20, 2016

దైనికరాగం

కిటికీ చీల్చుకుచూసే కిరణాలు
నిలకడగా తలగడపై
తట్టేస్తూ కనుతలుపుతీస్తూ
ధూళితో జతగా ఆడీపాడే
భూపాల ప్రభాతరాగం!

దారి పక్కన మల్లెపూలు
గుత్తులు గుత్తులుగా
గుబాళిస్తూ, పరవశిస్తూ
గాలి తమగళమై పాడే
మోహన సరాగరాగం !

సందియ వందలకాంతులు
చిత్తరువుల చివురులుగా
ఆకాశపు అందంమెరిపిస్తూ
సూర్యునితో హోళీ అడే
వసంత వాహినీరాగం!

Saturday, July 16, 2016

తెలుగుతారలు

తెలుగు మాటలు
ఎక్కడో వెలుగుతాయని
నోటిలో నలుగుతాయని
గోటితో కలుగులోతోసే
పరభాషా చదువు వ్యాపారాల్లో
భాషను కనుమరుగు చేసే లోకంలో
సభావేదికల మాటల్లా కాక,
సభనేలే బాలల మాటలకై
మనబడి వినీలాకాశంలో
ఆగక నడిచే తెలుగుతారలు మీరు!

గుండెల్లో దొరలిందని
అండల్లే నిలవాలనుందని
ఎండైనా వానైనా
ఎడదల్లో బరువున్నా
ఆగక అడుగులనేసి
దాగిన తెలుగును తీసి
ఆగని వెలుగును చూసి
వెలిగే బాలలను చేసి,
ఆనందం అందులోనే చూసే
అందరం ఆనందంగా చేసే
నిజవెలుగులు
భాషాసేవకులైన
తెలుగు తారలు మీరు!

Tuesday, July 5, 2016

ప్రకృతి గుణం

తరూలతలను తాకి
తదేకంగా తలవంచుకు నేలను చూస్తూ
పలకరింపుకోసం జారుతున్న
ముత్యంలాంటి వేకువజల్లులో
ఎంత వినయం! ఎంత సిగ్గు!

మహీరుహంబులను ఊపి
తమవేననే గాలికబుర్లు వినే కొమ్మల వీస్తూ
తొలిపలకరింపుకోసం వెళుతున్న
సుప్రభాతంలాంటి ప్రాతఃసమీరంలో
ఎంత ఆప్యాయత! ఎంత కలుపుగోలు!

ధరణీతలంబున ఆగి
తనపై ఉలిపోట్లకు ఓడక, తననే వేడే రూపాల పుట్టిస్తూ
తను కదలక మనల్ని నడిపిస్తున్న
పాషాణపు దయార్ద్రహృదయంలో
ఎంత ఓర్పు! ఎంత దైవత్వం!

ప్రకృతి గుణం

తరూలతలను తాకి
తదేకంగా తలవంచుకు నేలను చూస్తూ
పలకరింపుకోసం జారుతున్న
ముత్యంలాంటి వేకువజల్లులో
ఎంత వినయం! ఎంత సిగ్గు!

మహీరుహంబులను ఊపి
తమవేననే గాలికబుర్లు వినే కొమ్మల వీస్తూ
తొలిపలకరింపుకోసం వెళుతున్న
సుప్రభాతంలాంటి ప్రాతఃసమీరంలో
ఎంత ఆప్యాయత! ఎంత కలుపుగోలు!

ధరణీతలంబున ఆగి
తనపై ఉలిపోట్లకు ఓడక, తననే వేడే రూపాల పుట్టిస్తూ
తను కదలక మనల్ని నడిపిస్తున్న
పాషాణపు దయార్ద్రహృదయంలో
ఎంత ఓర్పు! ఎంత దైవత్వం!

ప్రకృతి గుణం

తరూలతలను తాకి
తదేకంగా తలవంచుకు నేలను చూస్తూ
పలకరింపుకోసం జారుతున్న
ముత్యంలాంటి వేకువజల్లులో
ఎంత వినయం! ఎంత సిగ్గు!

మహీరుహంబులను ఊపి
తమవేననే గాలికబుర్లు వినే కొమ్మల వీస్తూ
తొలిపలకరింపుకోసం వెళుతున్న
సుప్రభాతంలాంటి ప్రాతఃసమీరంలో
ఎంత ఆప్యాయత! ఎంత కలుపుగోలు!

ధరణీతలంబున ఆగి
తనపై ఉలిపోట్లకు ఓడక, తననే వేడే రూపాల పుట్టిస్తూ
తను కదలక మనల్ని నడిపిస్తున్న
పాషాణపు దయార్ద్రహృదయంలో
ఎంత ఓర్పు! ఎంత దైవత్వం!

Saturday, July 2, 2016

చతుర్య తేజం

కనబడే పగటి నావలో నీవా?
కలలోని రేయి తోవలో నీవా?
కదలని హాయి నిద్రలో నీవా?
అన్నీ నీవైతే
అన్నీ నీవెవరంటే
అన్ని రూపాంతరాలుండే
నీవెవరివి?

అన్నీ తెలిసినట్టుండి
అన్నీ విడిగావుండి 
అవన్నీ అనామకంగా
తమలో తామెరుగనట్టు
నీ కాలాన్ని నడిపిస్తుంటే
పదేళ్ళ బాలుడి పగటి గీతలో
యాభైఏళ్ళ వాడి కలల పాతలో
సుషుప్తిరేళ్ళ నాడి ఖాళీ కతలో
నీవైయుండే
నీవెవరివి?

నేను అని
నువ్వు వెదికే
నీ అంతఃరూపం

నేను అనే
నీలో తెలిపే
నీ సచేతనారూపం

నీ రూపాలన్నీ తెలిసిన
నీ మనఃపూర్వక రూపం
"నీ"  మనోరూపం

అదే నీది
నిలబడేది
నీలా ఎదిగేది
నీవని తెలిపేది
నిశిలా తరగనిది
నీవు అనే చతుర్య తేజం
"నేను" అనే చాతుర్య నైజం!
  
(https://en.wikipedia.org/wiki/Turiya)

Friday, July 1, 2016

కర్తవ్యం

కళ్ళు నీళ్ళను చుట్టుకునీ
అందవిహీనం అవుతుంటే
వదిలేసి నగ్నంగా ఓక్షణం ఆనందిస్తే!

గుళ్ళు గళ్ళను నెట్టమని
మానవతావిహీన మనమంటే
వదిలేసి సమిధనై ఓక్షణం ధైర్యంగుంటే!

సంస్కారం ఆస్కారం ఇవ్వనని
మోడుచెట్టులా మనమంటే
వదిలేసి భగ్నమైన ఓక్షణం విదిలించేస్తే!

ఆకారం కారం చేరదని
నల్లమట్టిలా కనమంటే
వదిలేసి దుగ్ధమై ఓక్షణం కాల్చే వేస్తే!

ఆ క్షణం అంతర్యుద్ధం
ఆ క్షణం ఆనందార్థం
ఆ క్షణం ఆత్మయదార్థం
ఆ క్షణం జీవిత అర్థం !